Sunday 17 April 2011

హెల్పింగ్ హార్ట్స్
తమిళనాడు వేలూరులోని హెల్పింగ్ హార్ట్స్ ఎందరో అనాథ బాలలను, వృద్ధులను, యువతలను ఆదుకొంటుంది. ఇల్లు విడిచి వచ్చిన వారికి స్వాంతన కల్పించి తిరిగి పంపించడం, మోసపోయిన యువతలను ఆదుకోవటం, రక్త దానం, నేత్ర దానం, అవయువాల దానం గురించి ప్రచారం చేయడం, వీధి బాలలను చేరదీసి మంచి మార్గంలో నడిపించడం చేస్తోంది. వేలూరులో అనాథ బాలల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఈ సంస్థను చంద్రశేఖరన్ ఏర్పాటు చేశారు. ప్రతి ఫలం ఆశించకుండా సాయపడుతూ డబ్బులు పోగొట్టుకున్న పిల్లలను, చెత్త కుండీలు, ఫుట్ పాత లపై వదిలేసిన పిల్లలను ఆదరించి ఆశ్రయం కల్పిస్తున్నారు. అనాథ శవాలకు దహన క్రియలు, ఎయిడ్స్, కుష్టు రోగులకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ సంస్థను స్థాపించిన ఈరా. చంద్రశేఖరన్ షోలింగర్ లో 1950 జూన్ 14 న రాజబాదర్, దేవకీ అమ్మాళ్ దంపతులకు జన్మించారు. విద్యార్ధి దశ నుంచి ఆయన ఇతరులకు సాయం చేసేవారు. ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ లలో ఉండి పలువురికి సాయం అందించారు. పాటశాల దశలోనే ఆయన 'ఎక్సలెంట్ స్టూడెంట్ ఇన్ క్యారెక్టర్' అని ప్రశంసలు అందుకున్నారు. చంద్రశేఖర్ తండ్రి బీడీ కార్మికుడు. చంద్రశేఖరన్ సోదరులు ఇద్దరు ఇంజనీర్లు, ఓ సారి గుజరాత్ కు చెందిన భారతి భట్ అనే మహిళా సి ఎం సి లో చికిత్స పొందుతుండగా ఆమెకు రక్తం అవసరం అయ్యింది. ఆ సమయంలో ఎలాంటి పరిచయం లేని చంద్రశేఖర్ ఆమెకు రక్తం అందించారు. దీంతో ఆమె తన బంధువులకు చంద్రశాఖరాన్ ను 'బ్లడ్ బ్రదర్' గా పరిచయం చేశారు. ఈ సంఘటనే ఆయన తరచూ రక్త దానం చేసేందుకు కారణమైంది. అలాగే రక్త దానం గురించి తరచూ ర్యాలీలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఇప్పటి వరకు పలువురు పలుమార్లు రక్త దానం చేశారు. తొలిసారిగా రక్త దానం పొందిన భారతి భట్ తన రెండు కళ్ళను దానంగా ఇచ్చింది. వాటిని వేలూరుకు చెందిన ఇద్దరికి అమర్చారు. అప్పటి నుంచి ఆయన అవయవ దానం పైన కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దానంగా పొందిన కళ్ళను వేలూరు సి ఎం సి, చెన్నై ఎగ్మూరులోని నేత్ర నిధిలో భద్ర పరుస్తూ అవసరం అయిన వారికి వాటిని అందిస్తున్నారు. అలాగే మృతుల శరీరాలను వారి బంధువుల అనుమతితో సి ఎం సి కు అప్పగిస్తున్నారు. అనాథ బాలల కోసం వేలూరు బస్టాండ్ సమీపంలోని  ఓ అద్దె భవనంలో ఆశ్రమం కూడా ఏర్పాటు చేసింది. చెడు అలవాట్లు ఉన్న పిల్లలను సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు. 1988  వ సంవత్సరం హెల్పింగ్ హార్ట్స్ ప్రారంభించగా 1994 జూన్ 14 న ట్రస్టు గా నమోదు చేశారు. ఈ సేవలు కొనసాగించే నిమిత్తం స్థానికుల నుంచి నగదు, లేకపోతే పనికిరాని వస్తువులను, 'పిడికెడు బియ్యం'  పథకం కింద పిడికెడు బియ్యం  సేకరిస్తున్నారు. వాటితో సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. హోటళ్ళలో మిగిలే ఆహార పదార్థాలను సేకరించి బిక్షగాళ్ళకు పెడుతున్నారు. చంద్రశేఖరన్ కు మలర్విలి అనే భార్య, కబిలన్ అనే కుమారుడు, తిరుమాదు అనే కుమార్తె ఉన్నారు.

No comments:

Post a Comment